కుటుంబంలో ఒకరికి కరోనా పరీక్ష.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

కరోనా వైరస్ (కోవిడ్ 19) కేసులు రోజురోజుకూ పెరుగుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి కుటుంబంలో ఒకరికి కరోనా పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత రెడ్ జోన్ మండలాల్లో దీన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా శనివారం ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో ప్రతి ఇంట్లో ఒకరికి ర్యాండమ్‌గా కరోనా పరీక్షలు నిర్వహించారు. గ్రామ వలంటీర్లు తమ పరిధిలోని 50 కుటుంబాల్లో ఒక్కొక్కరి చొప్పున తీసుకెళ్లి కరోనా పరీక్షలు చేయించారు. ఈ ఫలితాలు రెండు రోజుల్లో వస్తాయని అధికారులు తెలిపారు.