కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: బెజవాడలో ఐదుగురు జర్నలిస్ట్‌లకు కరోనా

మీడియా ప్రతినిధులకు కరోనా వ్యాధి లక్షణాలు వెలుగు చూసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది.
విజయవాడ నగరంలో ఐఎంఏ , ఏపీయూడబ్ల్యుజె సంయుక్తంగా ఇటీవల జర్నలిస్టులకు ఉచిత కరోనా స్క్రీనింగ్ క్యాంపును నిర్వహించాయి . ఈ క్యాంపునకు విజయవాడలో పనిచేస్తున్న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై పరీక్షలు చేయించుకున్నారు. వీరి నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రిలోని ల్యాబ్‌కు పంపారు. ఫలితాల్లో ఐదుగురికి కరోనా లక్షణాలు కనిపించాయని ఐఎంఏ నగర కార్యదర్శి డాక్టర్ తుమ్మల కార్తీక్ చెబుతున్నారు.